రేవంత్​ రెడ్డి బెయిల్​ పిటిషన్​ పై విచారణ వాయిదా

  • మంగళవారానికి వాయిదా వేసిన రాజేంద్రనగర్ కోర్టు
  • ఇదే కేసులో ఆరుగురికి బెయిల్ మంజూరు
  • రిమాండ్ పై చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ ను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారన్న ఆరోపణల కేసులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి నిన్న అరెస్టయిన విషయం తెలిసిందే. చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న రేవంత్ రెడ్డి తనకు బెయిల్ కోరుతూ రాజేంద్రనగర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ కేసులో మిగిలిన ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరైంది.

Revanth Reddy
Congress
Telangana
Bail
petetion

More Telugu News